ఆలయానికి వెళ్లిన ఇద్దరు అదృశ్యం | Two children missing | Sakshi
Sakshi News home page

ఆలయానికి వెళ్లిన ఇద్దరు అదృశ్యం

Jun 19 2016 2:24 PM | Updated on Apr 4 2019 4:44 PM

జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక, బాలుడు అదృశ్యం అయ్యారు. ఏడుకొండలు, సుశీల దంపతుల పిల్లలైన లక్ష్మి కల్యాణి (14), పునీత్ (8) శనివారం సాయంత్రం ఇంటి సమీపంలోని ఓ ఆలయానికి వెళ్లారు.

హైదరాబాద్ : జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక, బాలుడు అదృశ్యం అయ్యారు. ఏడుకొండలు, సుశీల దంపతుల పిల్లలైన లక్ష్మి కల్యాణి (14), పునీత్ (8) శనివారం సాయంత్రం ఇంటి సమీపంలోని ఓ ఆలయానికి వెళ్లారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి తన వెంట తీసుకెళ్లిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా వారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement