11, 12 తేదీల్లో టీఆర్‌ఎస్ ప్లీనరీ? | TRS party planning for plenary meeting on october 11,12 | Sakshi
Sakshi News home page

11, 12 తేదీల్లో టీఆర్‌ఎస్ ప్లీనరీ?

Sep 23 2014 3:04 AM | Updated on Aug 15 2018 9:22 PM

వచ్చే నెల 11, 12 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు.

సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11, 12 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్  సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రతీ నియోజకవర్గానికి 200-250 మంది చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల మంది ముఖ్యులను ఈ ప్లీనరీ సమావేశాలకు ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా ప్రవేశపెట్టబోయే ముఖ్య కార్యక్రమాలు, వాటి ఉద్దేశాలు, పార్టీ శ్రేణులు వ్యవహరించాల్సిన తీరుపై 2 రోజులపాటు వివరించాలని నిర్ణయించారు. సమావేశానికి రాష్ట్ర, జిల్లా పార్టీ ముఖ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులను ఆహ్వానించనున్నారు. ఉపన్యాసకులుగా రిటైర్డు ఐఏఎస్‌లు, పార్టీ సీనియర్లు వ్యవహరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement