తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని చేపట్టింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని చేపట్టింది. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను సందర్శించేందుకు రేపు ఉదయం 10 గంటలకు గాంధీభవన్ నుంచి టీపీసీసీ ముఖ్య నేతలు బయల్దేరుతున్నారు.
లాఠీ చార్జ్ లో గాయపడిని రైతులను వారు పరామర్శిస్తున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వెళ్లిన ముంపు గ్రామాల ప్రజలపై పోలీసులు లాఠీచార్జీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను టీపీసీసీ తీవ్రంగా ఖండించింది.