చంద్రబాబు.. రెయిన్గన్ల పేరుతో మభ్యపెట్టొద్దు | topudurthi prakash reddy takes on chandra babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. రెయిన్గన్ల పేరుతో మభ్యపెట్టొద్దు

Oct 17 2016 3:22 PM | Updated on Jul 28 2018 6:35 PM

చంద్రబాబు.. రెయిన్గన్ల పేరుతో మభ్యపెట్టొద్దు - Sakshi

చంద్రబాబు.. రెయిన్గన్ల పేరుతో మభ్యపెట్టొద్దు

చంద్రబాబు నాయుడు రాయలసీమ కరువు పేరుతో వెయ్యి కోట్ల రూపాయల దోపిడీకి సిద్ధపడ్డారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ కరువు పేరుతో వెయ్యి కోట్ల రూపాయల దోపిడీకి సిద్ధపడ్డారని వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తక్కువ ఖర్చుతో బైరవాన్ తిప్ప ప్రాజెక్టు, పేరూరు డ్యామ్లకు నీళ్లు ఇవ్వవచ్చని, అయితే కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

టీడీపీ నేతల ఆర్థిక ప్రయోజనాల కోసమే అనంతపురం జిల్లాలో ప్రాజెక్టులు చేపడుతున్నారని అన్నారు. చంద్రబాబు రెయిన్గన్ల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టవద్దని వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి అనంతపురం జిల్లాకు నీళ్లిచ్చే అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు ఉపయోగించుకోవడంలేదని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement