టుడే న్యూస్ అప్ డేట్స్ | Today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్ డేట్స్

Aug 10 2016 6:16 AM | Updated on Sep 4 2017 8:43 AM

నేడు రుషికేశ్ వెళ్లనున్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

*న్యూఢిల్లీ: నేడు రుషికేశ్ వెళ్లనున్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రత్యేక హోదా కాంక్షిస్తూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నిర్వహిస్తున్న పూజల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు. అనంతరం స్వామి వారు ఆశీస్సులు ఆయన తీసుకుంటారు.

*న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీతో నేడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ. రహదారులపై చర్చ


*న్యూఢిల్లీ : నేటి సాయంత్రం 6.00 గంటలకు సమావేశం కానున్న కేంద్రమంత్రి వర్గం


*హైదరాబాద్ : గ్యాంగస్టర్ నయిమ్ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ప్రకటన. సిట్ సభ్యులను ప్రకటించనున్న డీజీపీ


*చెన్నై : నేడు కూడంకుళంలోని అణువిద్యుత్ కేంద్రం జాతికి అంకితం. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ, సీఎం జయలలిత, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలసి వీడియో కాన్ఫరన్స్ ద్వారా జాతికి అంకితం.

*రియో ఒలింపిక్స్ : నేడు ఆస్ట్రేలియాతో భారత హాకీ జట్టు ఢీ.

*మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆమరణ దీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement