నేటి ముఖ్య వార్తలు..

సాక్షి, హైదరాబాద్‌:

♦ యువభేరి
నేడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో యువభేరి సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరుకానున్నారు.

 టీపీసీసీ ధర్నా
ఇవాళ ఉదయం 10 గంటలకు ట్యాంక్‌ బండ్‌ వద్ద టీపీసీసీ ధర్నా నిర్వహించనుంది.

♦ ప్రెస్‌ అకాడమీ
నేడు విజయవాడలో ఏపీ ప్రెస్‌ అకాడమీ కార్యాలయం ప్రారంభంకానుంది.

♦ చౌరస్తా మూసివేత
నేటి నుంచి ఎల్‌బీనగర్‌ చౌరస్తా మూసివేయనున్నారు. స్కైవే, మెట్రో పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ ఆంక్షలుండనున్నాయి. యూటర్న్‌ ద్వారా ట్రాఫిక్‌ను మళ్లింపు చేయనున్నారు. 

♦ బీజేపీ కార్యవర్గ భేటి
నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది.

♦ చలో వంశధార
ఇవాళ  అఖిలపక్షం ఆధ్వర్యంలో చలో వంశధార కార్యక్రమం జరగనుంది. దీంతో వంశధార ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

♦ ఓపెన్‌ డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్‌
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ డిగ్రీ/పీజీ దూర విద్య కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. చివరి తేది ఈ నెల 21 

♦ రెండో టీ20
నేడు భారత్‌-ఆస్ట్రేలియా రెండో టీ20 జరగనుంది. గువాహటి వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

♦ ఫిఫా వరల్డ్‌ కప్‌
అండర్‌-17 ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌లో నేడు కోస్టారికా vs గయానా, స్పెయిన్‌ vs నైగర్‌, ఇరాన్‌ vs జర్మనీ, కొరియా vs బ్రెజిల్‌ మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top