వైఎస్‌ఆర్‌సీపీ కార్యలయ ప్రారంభం
ఇవాళ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన కార్యలయం విజయవాడలోని బందర్ రోడ్డులో సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
సీఎం చంద్రబాబు పర్యటన
నేడు విశాఖపట్టణంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భూగర్భ విద్యుత్ వ్యవస్థకు శంకుస్థాపనతో పాటు రెండు రోజులపాటు జరిగే బ్లాక్ చైన్ సదస్సును ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు నుంచి పలుజిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కొత్త జిల్లాల కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల సముదాయలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేటి నారయణ్‌ఖేడ్ పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడింది.
సీపీఎం ఆందోళనలు
బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా ఇవాళ సీపీఎం ఆందోళనలు నిర్వహించనుంది
లారీల బంద్..
రోజువారీ డీజిల్ ధరల మార్పిడి, టోల్‌ట్యాక్స్ విధానానికి నిరసనగా ఇవాళ, రేపు దేశ వ్యాప్తంగా లారీల రవాణాను నిలిపి వేస్తున్నట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
బీజేపీ శాంతి ర్యాలీ..
నేడు బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యాలయం వరకు శాంతి ర్యాలీ జరగనుంది.
వర్ష సూచన
ఉపరితల ఆవర్తన కారణంగా తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నేటి పెట్రోలు/ డీజిల్ ధరలు
పెట్రోలు ఏడు పైసలు పెరిగి లీ. రూ. 72.41 ఉండగా డీజిల్ 5 పైసలు పెరిగి 61.93 గా ఉంది.
అండర్-17 ఫిఫా ప్రపంచకప్
నేడు అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కొలంబియాతో భారత్, పరాగ్వేతో న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
పీబీఎల్ వేలం
ఇవాళ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ మూడో సీజన్ వేలం జరగనుంది. 133 మంది స్వదేశీ, విదేశీ క్రీడాకారులకోసం 8 ఫ్రాంచైజీలు పోటిపడనున్నాయి.