నేటి ముఖ్యవార్తలు.. | Today News updates | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యవార్తలు..

Oct 17 2017 8:18 AM | Updated on Oct 17 2017 8:18 AM

వైఎస్‌ జగన్‌ పర్యటన
ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. చేనేత కార్మికుల దీక్షలకు సంఘీభావం తెలపడంతో పాటు.. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.

సీఎం పర్యటన
నేడు విశాఖజిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.


వర్ష సూచన
బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ సూచించింది.


ఫిఫా వరల్డ్‌ కప్‌
నేడు ఇరాన్‌ vs మెక్సికో, ఫ్రాన్స్‌ vs స్పెయిన్‌, మాలి vs ఇరాక్‌, ఇంగ్లండ్‌ vs జపాన్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

డెన్మార్క్‌ ఓపెన్‌
నేటి నుంచి డెన్మార్క్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్ని ప్రారంభంకానుంది. భారత క్రీడాకారులు పీవీ సింధు, సైనానెహ్వాల్‌, శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌లు బరిలోకి దిగనున్నారు.​

వార్మప్‌ మ్యాచ్‌
ఇవాళ బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌, న్యూజిలాండ్‌ జట్లు వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement