48 గంటలు గడుస్తున్నా చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది.. ఇంకా ఈనాటి ఇతర ముఖ్య కథనాలు, వాటి వివరాలు..
48 గంటలు గడుస్తున్నా చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. బోరుబావి నుంచి చిన్నారిని వెలికితీసేందుకు సహాయక సిబ్బంది విశ్రప్రయత్నాలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీని ఉపయోగించి పాపను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమయం గడిచేకొద్ది ఆశలు సన్నగిల్లుతున్నాయి. పాప సురక్షితంగా బయటపడేనా అన్నది ఉత్కంఠగా మారుతోంది. పాప బయటపడాలని ప్రజలంతా కోరుతున్నారు. దేవుళ్లను ప్రార్థిస్తున్నారు... ఇక ఈనాటి ముఖ్య కథనాలు ఇవి..
బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న క్షణాలు!
48 గంటలు గడుస్తున్నా చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది.
చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేం!
180 అడుగుల వద్ద నీళ్లు తగలడంతో చిన్నారి ఆచూకీ లభించలేదని, దీంతో ప్రత్యేక మోటారు ద్వారా నీటిని అంతటిని తోడిస్తున్నామని...
కోవింద్ విజయం ఖాయం: వైఎస్ జగన్
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించారు.
నీట్‌లో మెరిసిన కల్వకుర్తి వాసి
కల్వకుర్తి పట్టణానికి చెందిన చేకూరి మహేశ్వరాచారి శుక్రవారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఆలిండియా 1280 వ ర్యాంకు సాధించి సత్తాడాటాడు.
మృత్యుంజయురాలు ఈ అంజలి
చేవెళ్లలో పాప బోరుబావిలో మృత్యువుతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన టీవీల్లో చూస్తున్న వారంతా అంజలిని గుర్తుచేసుకుంటున్నారు
కాన్వాయ్ అడ్డుకుని.. ఎంపీని చితకబాదారు!
అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ కార్యకర్తలు ఏకంగా ఓ బీజేపీ ఏంపీని టార్గెట్ చేసి చితకబాదారు.
భార్య చేతిలో చెయ్యేస్తే నొప్పి మాయం
ఆలు మగలు చేతిలో చేయేసి పట్టుకు తిరగాలోయ్! అని ఓ భావ కవి ఊరికే అనలేదేమో!
అల్ జజీరాను మూసేయాల్సిందే!
ఖతార్‌ను ఇప్పటికే బహిష్కరించిన అరబ్ దేశాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు తమ 13 డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా అల్టిమేటమ్ జారీ చేశాయి.
ట్రంప్ హత్య.. సారీ చెప్పిన హీరో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్యచేయబోయేది ఎవరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్ హీరో జానీ డెప్ ఎట్టకేలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
మోదీ-ట్రంప్ భేటీలో ఆ ప్రస్తావనే ఉండదు
మోదీ-ట్రంప్ భేటీలో హెచ్-1బీ వీసా సమస్యను ప్రస్తావించే ప్రణాళికలేమీ లేవని వైట్ హౌజ్ పేర్కొంది.
అందుకే సమంతను అంబాసిడర్ చేశాం: మంత్రి
సీఎం కేసీఆర్ చిన్నప్పటి నుంచి చేనేత కార్మికుల కష్టాలను కళ్లారా చూశారని అందుకే నేతన్నల ఇబ్బందులు తీర్చేందుకు భారీగా నిధులు కేటాయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మంత్రులు, ఎమ్మెల్యేల ఒక నెల జీతం రైతులకు!
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
శ్రీనగర్‌లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు!
జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు.
ఎమ్మెల్యే కుమారుడి కిరాతకం
ఇద్దరు మైనర్ బాలురను సజీవసమాధిచేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకుతోపాటు ఇసుక మైనింగ్ కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బుజ్జి గజరాజు అమేజింగ్ వీడియో!
అప్పుడప్పుడే తప్పటడుగులు వేసే బుజ్జాయిలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది.
మీరా కుమారే ప్రధాని అయితే...
ప్రతిపక్షాల పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దళిత మహిళ మీరా కుమార్ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెట్టలేక పోవచ్చు.
ఇదిగో బండ బూతుల.. బండారం!
టీడీపీ ఎమ్మెల్యే బండారు జుగుప్సాకర వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన.
భారత్ గురించి ట్రంప్ ‘రియలైజ్’ అయ్యారా!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్‌ను అగ్రరాజ్యం పెద్దగా పట్టించుకోవడం లేదన్న కథనాల నేపథ్యంలో..
బిజినెస్..
మూర్తి కనిపించకపోవడం ఆశ్చర్యం
తొలిసారి ఇన్ఫోసిస్ సహా-వ్యవస్థాపకులు నేడు జరిగిన అత్యంత కీలకమైన సమావేశానికి హాజరుకాలేదు.
హోండా వెహికిల్స్ రేట్లు దిగొస్తున్నాయ్!
దేశమంతటిన్నీ ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు కాబోతున్న తరుణంలో ప్రముఖ వాహన దిగ్గజం తన టూ-వీలర్ రేట్లను తగ్గించబోతుంది.
రాకెట్‌లా ఎగిసిన రాష్ట్రాల లోటు
రాష్ట్రాల వాణిజ్య లోటులు స్కై రాకెట్ లా ఎగిసినట్టు ఆర్బీఐ నేడు వెల్లడించిన గణాంకాల్లో తెలిసింది.
సినిమా..
‘క్వీన్’ అవ్వడానికి నేను రెడీ: నటి
క్వీన్‌గా మారడానికి ఏ భాషలోనైనా తాను రెడీ అంటోంది నటి కాజల్ అగర్వాల్.
ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ దగ్గర భాయిజాన్ ఈసారి మెరవలేదు. గత ‘ఈద్’ సినిమాల కంటే దారుణంగా వెనకబడ్డాడు.
విజయ్ కొత్త సినిమా 'అదిరింది'
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మెర్సల్. యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
అల్లు అర్జున్ కెరీర్ లోనే డీజే టాప్..!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల