
భారత్ గురించి ట్రంప్ ‘రియలైజ్’ అయ్యారా!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్‌ను అగ్రరాజ్యం పెద్దగా పట్టించుకోవడం లేదన్న కథనాల నేపథ్యంలో..
- మోదీ పర్యటన నేపథ్యంలో ట్రంప్ సర్కారు ఆసక్తికర వ్యాఖ్యలు
- మంచి కోసం పాటుపడే శక్తి భారత్ అని ట్రంప్ రియలైజేషన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్‌ను అగ్రరాజ్యం పెద్దగా పట్టించుకోవడం లేదన్న కథనాలను ట్రంప్ సర్కారు కొట్టిపారేసింది. ప్రపంచంలో ‘మంచి కోసం పాటుపడే శక్తి’ భారత్ అనే విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తించారని పేర్కొంది. భారత్‌తో సంబంధాలు ఎంతో కీలకమని తాము భావిస్తున్నట్టు తెలిపారు.
‘తమ ప్రభుత్వం భారత్‌ను విస్మరిస్తున్నదని, లేదా ఆ దేశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే వాదన తప్పు. భారత్‌ను అమెరికా నిజంగా కొనియాడుతోంది. ప్రపంచంలో మంచి కోసం పాటుపడే శక్తిగా భారత్‌ను అధ్యక్షుడు ట్రంప్ గుర్తించారు. భారత్‌తో సంబంధాలు కీలకమని భావిస్తున్నారు. మోదీ పర్యటనలో ఇదే విషయం వెలుగులోకి వస్తుంది’ అని ట్రంప్ సర్కారుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ నెల 25 నుంచి రెండు రోజుల పర్యటన కోసం అమెరికాకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.