మోదీ-ట్రంప్ భేటీలో ఆ ప్రస్తావనే ఉండదు

మోదీ-ట్రంప్ భేటీలో ఆ ప్రస్తావనే ఉండదు - Sakshi

వాషింగ్టన్ : మరో కొన్ని గంటల్లో శ్వేతాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో భారతీయులకు, టెక్నాలజీ కంపెనీలకు ప్రధాన సమస్యగా ఉన్న హెచ్-1బీ వీసా విధానంపై క్లారిటీ వస్తుందని తెగ ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలు మోదీ-ట్రంప్ భేటీలో హెచ్-1బీ వీసా సమస్యను ప్రస్తావించే ప్రణాళికలేమీ లేవని వైట్ హౌజ్ పేర్కొంది. ఈ విషయాన్ని తాము సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపింది. '' హెచ్-1బీ వీసా, విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించే ప్లాన్స్ ఏమీ లేవు'' అని అడ్మినిస్ట్రేటివ్ సీనియర్ అధికారి చెప్పారు.

 

ఒకవేళ భారత్ వైపు నుంచి  ఈ ప్రస్తావనే వస్తే, దానికి సమాధానం చెప్పేందుకు అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని ఆ అధికారి చెప్పారు.  అదేవిధంగా తక్షణమే వీసా దరఖాస్తులు లేదా జారీ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేపట్టమని స్పష్టంచేశారు. రివ్యూలో ఏమొస్తుందో కూడా ఊహించే పరిస్థితుల్లో లేమన్నారు. ఏ దేశాన్ని లేదా రంగాన్ని ఉద్దేశించి దీనిలో మార్పులు చేయబోమని తేల్చిచెప్పారు. సోమవారం ట్రంప్, మోదీ కాబోతుండగా.. ఈ భేటీలోనైనా ఈ సమస్యలకు పరిష్కారం దొరికిదంటూ ఎదురుచూసిన వారి ఆశలను వైట్ హౌజ్ అడియాసలు చేసింది. ట్రంప్ కార్యాలయం హెచ్-1వీసా విధానంపై చర్చించే ప్రస్తావన లేదంటూ సంకేతాలు ఇచ్చింది. 

 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top