నీట్‌లో మెరిసిన కల్వకుర్తి వాసి | cbse-neet-result-2017-declared | Sakshi
Sakshi News home page

నీట్‌లో మెరిసిన కల్వకుర్తి వాసి

Jun 24 2017 4:56 PM | Updated on Oct 20 2018 5:44 PM

నీట్‌లో మెరిసిన కల్వకుర్తి వాసి - Sakshi

నీట్‌లో మెరిసిన కల్వకుర్తి వాసి

కల్వకుర్తి పట్టణానికి చెందిన చేకూరి మహేశ్వరాచారి శుక్రవారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో ఆలిండియా 1280 వ ర్యాంకు సాధించి సత్తాడాటాడు.

కల్వకుర్తి ‌: కల్వకుర్తి పట్టణానికి చెందిన చేకూరి మహేశ్వరాచారి శుక్రవారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో ఆలిండియా 1280 వ ర్యాంకు సాధించి సత్తాడాటాడు. రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన పాండురంగాచారి, రత్నమాల కుమారుడైన మహేశ్వరాచారి పదో తరగతి కల్వకుర్తిలోనే చదవాడు ఇంటర్‌ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ 981 మార్కులు సాధించాడు. నీట్‌ పరీక్షలకు హాజరై 621 మ మార్కులతో 1280 వ ర్యాంకును దక్కించుకున్నారు. 
 
విద్యార్థిని సాక్షి పలకరించగా మంచి ర్యాంకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. 1500 వరకు ర్యాంకు వస్తుందని అంతకంటే మెరుగు రావడం ఇటీవలే 100 వసంతాలు పూర్తిచేసుకున్న ఉస్మానియా కళాశాలలో వైద్య విభాగంలో సీటు లభిస్తుందన్న ఆనందం పట్టలేకపోతున్నా అని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కృషి పట్టుదలతో మంచి స్థానం సాధించడంతోపాటు వైద్యంలోనూ మంచి విద్యనభ్యసించి వృత్తికి గౌరవం తెస్తానని మహేశ్వరాచారి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement