నేడు, రేపు వడగాడ్పులు...మోస్తరు వర్షాలు | Today and tomorrow Moderate rains and heat weather | Sakshi
Sakshi News home page

నేడు, రేపు వడగాడ్పులు...మోస్తరు వర్షాలు

May 16 2017 12:19 AM | Updated on Sep 4 2018 4:48 PM

మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని, వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఆదిలాబాద్, నల్లగొండల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత  

సాక్షి, హైదరాబాద్‌: మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని, వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అనేక చోట్ల 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టంచేసింది. మరోవైపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు సోమవారం ఎండలు మండాయి.

ఆదిలాబాద్, నల్లగొండల్లో 45 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతా ల్లోనూ 44 డిగ్రీలు రికార్డు అయ్యాయి. గత 24 గంటల్లో నాగర్‌ కర్నూలులో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్, నవాబ్‌పేట్, మగ్నూరు, దోమకొండ, రామాయంపేటల్లో ఒక సెంటీమీటర్‌ చొప్పున వర్షం కురిసింది.

Advertisement
 
Advertisement
Advertisement