కేబీఆర్ పార్క్ వద్ద దొంగల హల్చల్ | theft at hyderabad kbr park | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్క్ వద్ద దొంగల హల్చల్

Feb 14 2016 10:17 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో దోపిడి దొంగలు హల్చల్ సృష్టించారు. ఎప్పుడూ రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ వద్ద దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.

హైదరాబాద్ :హైదరాబాద్లో దోపిడీ దొంగలు హల్చల్ సృష్టించారు.  ఎప్పుడూ రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ వద్ద దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ప్రేమికుల దినోత్సవం కావడంతో పార్కు వద్ద ఆదివారం హడావుడి నెలకొంది.

ఈ క్రమంలో నగరానికి చెందిన ప్రేమికుల కారు అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు కారులో ఉంచిన 15 తులాల బంగారాన్ని దొంగలు దోచుకుపోయారు. దీనిపై బాధితులు స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని ధ్వంసం చేయడంతో తోటి వాకర్స్ ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement