ఒంటరి ‘పోరు’ | The single 'Fighting' | Sakshi
Sakshi News home page

ఒంటరి ‘పోరు’

Jan 30 2016 12:58 AM | Updated on Sep 3 2017 4:34 PM

ఒంటరి ‘పోరు’

ఒంటరి ‘పోరు’

సాధారణంగా ఎన్నికల ప్రచారమంటే హంగూ ఆర్భాటం..మందీ మార్బలం తప్పనిసరి.

సాధారణంగా ఎన్నికల ప్రచారమంటే హంగూ ఆర్భాటం..మందీ మార్బలం తప్పనిసరి. డప్పు చప్పుళ్లు, మైకుల మోతలు, కార్యకర్తల హంగామా ఉండాల్సిందే. ఇలా జనంలోకి వెళ్తేనే.. ఓట్లు రాలడం కష్టతరమవుతున్న ఈ రోజుల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి ఒంటరి పోరుకు దిగాడు. ఎలాంటి హంగామా లేకుండా..కార్యకర్తలెవరూ పక్కన లేకుండా.. ఒంటరిగా ఓ గుర్రపు బగ్గీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ఆయనే  సూరారం డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బర్ల శ్రీను. కేవలం తన గుర్తున్న జెండాలను బగ్గీకి కట్టేసి ఒంటరిగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.    - సూరారం

Advertisement
 
Advertisement
Advertisement