రెచ్చిపోతున్న ప్రైవేటు ఫైనాన్షియర్స్ | The private financier 's harassment | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న ప్రైవేటు ఫైనాన్షియర్స్

Oct 31 2015 3:25 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ లో రోజు రోజుకూ ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దురాగతాలు పెరిగి పోతున్నాయి.

హైదరాబాద్ లో  రోజు రోజుకూ ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దురాగతాలు పెరిగి పోతున్నాయి. తాజాగా.. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో వెంకటేశ్ అనే వ్యక్తిపై ఫైనాన్షియర్ దాడికి దిగాడు. తీసుకున్న అప్పు తీర్చేసినా.. తీర్చ లేదంటూ ఇంటిపై దాడి చేశారు.

ఇంట్లో ఉన్న మహిళలతో అసభ్యంగా మాట్లాడి.. ఇంటి బయట ఉన్న కారుతో చెక్కేశారని బాధితుడు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాను తీసుకున్న లోన్ కట్టే శానని.. అయినా.. ఫైనాన్స్ వారు నిత్యం వేధిస్తున్నారని వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement