ఇంజక్షన్ వికటించి డ్రైవర్ మృతి | The injection took its toll and the driver killed | Sakshi
Sakshi News home page

ఇంజక్షన్ వికటించి డ్రైవర్ మృతి

Aug 26 2016 6:47 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఇంజెక్షన్‌ వికటించి క్యాబ్‌ డ్రైవర్‌ హైదరాబాద్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన​ పరిథిలో మరణించాడు.

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే.. వైద్యుడు నిర్లక్ష్యంతో సరైన ఇంజక్షన్ ఇవ్వకపోవ డంతో.. సూది మందు వికటించి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని రాయదుర్గంలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. స్థానిక రాఘవేంద్ర క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో.. మృతిచెందాడు. దీంతో మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement