మీర్ పేటలో బాలిక అదృశ్యం | The girl 's disappearance in Hyderabad | Sakshi
Sakshi News home page

మీర్ పేటలో బాలిక అదృశ్యం

Nov 9 2015 6:14 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.

ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇషఫ్రిల్ కుటుంబం గత కొన్ని రోజులుగా మీర్‌చౌక్ మోడ్రన్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటోంది. కాగా, ఇషఫ్రిల్ కూతురు అస్మా (14) ఈ నెల 5వ తేదీన ఉదయం 7 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది.

అనంతరం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేశారు. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోవటంతో మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు అస్మా పంజాబీ డ్రెస్సు ధరించి ఉందని.. ఆచూకీ తెలిసిన వారు 040-27854797, 9490616749 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement