యువతి అదృశ్యం | The disappearance of a young woman | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

May 8 2016 6:31 PM | Updated on Sep 4 2018 5:21 PM

మేనత్త ఇంటికి వెళ్లుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మేనత్త ఇంటికి వెళ్లుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్‌పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కామ్‌గార్‌నగర్ మున్సిపల్ క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన నర్సింహ్మారాజు కుమార్తె జి.శిరీష (20) ఈ నెల 7వ తేదీన ఇంటినుంచి చిక్కడపల్లిలోని మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయలు దేరింది.

 

అయితే ఆమె మేనత్త ఇంటికి చేరలేదు. ఇటు ఇంటికి కూడా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో తెలిసిన వారి ఇండ్ల వద్ద, బంధువు వద్ద శిరీష ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడ శిరీష ఆచూకీ లభించలేదు. దీంతో శిరీష అన్న సంతోష్ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాచిగూడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement