మహంకాళి టెంపుల్ వద్ద బ్యాగు కలకలం | tension at mahankali temple, unknown bag found | Sakshi
Sakshi News home page

మహంకాళి టెంపుల్ వద్ద బ్యాగు కలకలం

Jul 14 2016 7:45 AM | Updated on Sep 4 2017 4:51 AM

మహంకాళి టెంపుల్ వద్ద బ్యాగు కలకలం

మహంకాళి టెంపుల్ వద్ద బ్యాగు కలకలం

ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వద్ద గురువారం వేకువజామున ఓ బ్యాగు కలకలం రేపింది.

హైదరాబాద్‌సిటీ: ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వద్ద గురువారం వేకువజామున ఓ బ్యాగు కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాగును ఆలయ పరిసరాల్లో వదిలి వెళ్లారు. ఆ బ్యాగులో బాంబు ఉందేమోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చేరవేయడంతో చత్రినాక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు వచ్చి బ్యాగును పరిశీలించారు. బ్యాగులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement