నేడూ వడగాడ్పులు | Temperatures high and rains also in telangana | Sakshi
Sakshi News home page

నేడూ వడగాడ్పులు

May 24 2017 2:26 AM | Updated on Sep 4 2018 4:48 PM

నేడూ వడగాడ్పులు - Sakshi

నేడూ వడగాడ్పులు

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం కూడా వడగాల్పుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం కూడా వడగాల్పుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు నాలుగు రోజులపాటు కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశముందని వివరించింది. ఇదిలావుండగా మంగళవారం నల్లగొండలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం        ఉష్ణోగ్రత
ఆదిలాబాద్‌    44.1
భద్రాచలం    43.6
హైదరాబాద్‌    42.4
ఖమ్మం    42.6
మహబూబ్‌నగర్‌    44.2
నల్లగొండ    45.0
నిజామాబాద్‌    44.5

Advertisement
 
Advertisement
Advertisement