తెలంగాణ మాల మహాసంఘం ఆవిర్భావం | telangana sc assosiation | Sakshi
Sakshi News home page

తెలంగాణ మాల మహాసంఘం ఆవిర్భావం

May 26 2014 1:36 AM | Updated on Sep 2 2017 7:50 AM

తెలంగాణ మాల మహాసంఘం ఆవిర్భావం

తెలంగాణ మాల మహాసంఘం ఆవిర్భావం

అంబేద్కర్ ఆశయాలు, మాలమహానాడు స్థాపకుడు పీవీ రావు స్ఫూర్తితో మాలల హక్కులను పరిరక్షించడానికి, తెలంగాణ పునర్ నిర్మాణంలో తమ వంతు పాత్ర నిర్వహించడానికి ఏర్పాటైన వేదికే తెలంగాణ మాల మహాసంఘం అని ఆ సంఘం అధ్యక్షుడు మేక వెంకన్న అన్నారు.

 సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ ఆశయాలు, మాలమహానాడు స్థాపకుడు పీవీ రావు స్ఫూర్తితో మాలల హక్కులను పరిరక్షించడానికి, తెలంగాణ పునర్ నిర్మాణంలో తమ వంతు పాత్ర నిర్వహించడానికి ఏర్పాటైన వేదికే తెలంగాణ మాల మహాసంఘం అని ఆ సంఘం అధ్యక్షుడు మేక వెంకన్న అన్నారు. రాజకీయ, విద్యా, ఉపాధి రంగాల్లో మాలలకు సరైన  వాటా దక్కించుకోవడానికి, వారి సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ద్వారా పోరాటం చేస్తామన్నారు.

ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మాలమహా సంఘం ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ గత పదేళ్లలో మాలలు అన్ని రంగాల్లో అణచివేతకు గురయ్యారన్నారు. మాలమహానాడు స్థాపించి మాల లను చైతన్య పరిచిన వ్యక్తి పీవీ రావు అని, ఆయన మరణానంతరం మాలమహానాడు అనేక సంఘాలుగా విడిపోయి మాలల సమస్యలను గాలికి వదిలేశారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement