తెలంగాణ ఎంసెట్-2016 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2016 ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,43,524 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా అందులో 92.34 శాతం మంది విద్యార్థులు ఆదివారం ఉదయం పరీక్షకు హాజరయ్యారు. 11,068 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైయారు. తొలిసారిగా బయో మోట్రిక్ విధానాన్ని అమలుచేశారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరగనుంది. మెడికల్ పరీక్షకు సెట్ కోడ్ 'ఎస్' ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.