తెలంగాణ బడ్జెట్లో సాగునీటి రంగం అగ్రతాంబూలాన్ని అందుకుంది. సోమవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1,30,415 కోట్లుగా ప్రకటించగా అందులో సాగునీటి రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించారు.
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్లో సాగునీటి రంగం అగ్రతాంబూలాన్ని అందుకుంది. సోమవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1,30,415 కోట్లుగా ప్రకటించగా అందులో సాగునీటి రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించారు. అనంతరం సంక్షేమరంగం అధిక వాటాను దక్కించుకుంది.
ఇందులో ఎస్సీ సంక్షేమానికి రూ.7,122కోట్లు, ఎస్టీలకు రూ.3,552 కోట్లు, బీసీలకు 2,538 కోట్లు కేటాయించారు. అలాగే, మహిళా శిశు సంక్షేమానికి రూ.1,553కోట్లు, కళ్యాణలక్ష్మి పథకానికి రూ.738కోట్లు, ఆసరా పెన్షన్లకు 4,693కోట్లు, బ్రాహ్మణ సంక్షేమ నిథికి రూ.100కోట్లు కేటాయించింది.