గవర్నర్ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు | telangana bjp leaders met govrerner | Sakshi
Sakshi News home page

గవర్నర్ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

Jan 8 2016 11:24 AM | Updated on Mar 29 2019 9:31 PM

అధికార టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్ను కలిశారు.

హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్ను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేటాయించిన రిజర్వేషన్లను ఇతర పార్టీలకు తెలియకుండా అధికార పార్టీ గోప్యంగా ఉంచిందని అన్నారు. టీఆర్ఎస్ అక్రమాలను అరికట్టాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement