తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి జరగనున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై మొదట చర్చించనున్నారు.
గురువారం బీఏసీ సమావేశం జరిగింది. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 18, 24, 25 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుంది. బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, హరీష్ రావు, ప్రతిపక్ష నేత జానారెడ్డితో పాటు భట్టి విక్రమార్క, కిషన్ రెడ్డి, అక్బరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.