జాతీయ రహదారుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అయితే ఈ అన్యాయాన్ని సీఎం కేసీఆర్ సరిదిద్దారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు.
‘జాతీయ రహదారులను త్వరలో పూర్తిచేస్తాం’
Dec 23 2016 4:03 PM | Updated on Sep 4 2017 11:26 PM
హైదరాబాద్: జాతీయ రహదారుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అయితే ఈ అన్యాయాన్ని సీఎం కేసీఆర్ సరిదిద్దారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో జాతీయ రహదారులపై స్వల్పకాలిక చర్చ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఎంతో పట్టుదలతో నేషనల్ హైవేలను మంజూరు చేయించారన్నారు. స్వయంగా సీఎం కేసీఆరే రెండుసార్లు జాతీయ రహదారులను డిజైన్ చేశారని, మరో 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేలను నిర్మించుకుందామని తెలిపారు. హైదరాబాద్‌లో జాతీయ రహదారులను త్వరలో పూర్తిచేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు వేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement