సినిమాకని వెళ్లి.. సాప్ట్వేర్ ఉద్యోగుల అదృశ్యం | techies goes missing in Hyderabad | Sakshi
Sakshi News home page

సినిమాకని వెళ్లి.. సాప్ట్వేర్ ఉద్యోగుల అదృశ్యం

Dec 12 2014 9:11 AM | Updated on Oct 22 2018 7:50 PM

సినిమాకని వెళ్లి.. సాప్ట్వేర్ ఉద్యోగుల అదృశ్యం - Sakshi

సినిమాకని వెళ్లి.. సాప్ట్వేర్ ఉద్యోగుల అదృశ్యం

సినిమాకు అని వెళ్లిన ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు అదృశ్యమయ్యారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్ : సినిమాకు అని వెళ్లిన ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు అదృశ్యమయ్యారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ శివశంకర్ రావు కథనం ప్రకారం బోడుప్పల్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే మనేష్ పాటిల్ (32), ఆంటోని (21) సాప్ట్వేర్ ఉద్యోగులు. వీరిద్దరూ ఈనెల 9న సినిమాకని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వారి గురించి గాలించినా ఆచూకీ దొరక్కపోవటంతో కుటుంబ సభ్యులు నిన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగుల కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement