లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్ : లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయంలోని ప్రకాశం పంతులు చిత్ర పటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి ఎస్. రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రోజా, పార్టీ నేత విజయ్చందర్తోపాటు పలువురు పూలమాల వేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా.... న్యాయవాదిగా... ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు చేసిన సేవలను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.