'ప్రకటనల కోసమేనా తెలంగాణ ఏర్పాటు?' | t jeevanreddy fire on CM kCR | Sakshi
Sakshi News home page

'ప్రకటనల కోసమేనా తెలంగాణ ఏర్పాటు?'

Sep 8 2015 5:04 PM | Updated on Aug 14 2018 10:54 AM

'ప్రకటనల కోసమేనా తెలంగాణ ఏర్పాటు?' - Sakshi

'ప్రకటనల కోసమేనా తెలంగాణ ఏర్పాటు?'

హామీలు, ప్రకటనలకు పరిమితం అయ్యేందుకేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదని కాంగ్రెస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : హామీలు, ప్రకటనలకు పరిమితం అయ్యేందుకేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదని కాంగ్రెస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 15 నెలలు రైతు సంక్షేమం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆలోచించనేలేదని ఆయన విమర్శించారు. చైనాకు వెళ్లి పరిశ్రమలు తెస్తే మంచిదే, కానీ అందులో పది శాతమైనా రైతుల గురించి ఆలోచిస్తే బాగుండేదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కేసీఆర్కు లేదా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆయన మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement