'పేరు మార్చి హడావుడి చేస్తున్నారు' | T.Jeevan reddy takes on trs government | Sakshi
Sakshi News home page

'పేరు మార్చి హడావుడి చేస్తున్నారు'

Mar 13 2016 12:07 PM | Updated on Sep 3 2017 7:40 PM

రాష్ట్రంలో రైతులు కరువు కోరల్లో చిక్కుకుని కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు కరువు కోరల్లో చిక్కుకుని కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టి.జీవన్రెడ్డి మాట్లాడుతూ... కరువు మండలాల ప్రకటనలో ఆలస్యం జరిగిందని ఆరోపించారు.

ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి జీవన్రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు. పేరు మార్చి హడావుడి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీని జీవన్రెడ్డి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement