రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ కేసీఆర్‌.. ఎవడబ్బ సొమ్మని పంచుతున్నారు? ఈటల ఫైర్..

Etela Rajender: రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ కేసీఆర్‌.. ఈటల ఫైర్.. - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నాటి ప్రభుత్వాలు పేదల కు ఉచితంగా భూములను పంచితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా మారింది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ఆయా రైతుల నుంచి బలవంతంగా భూములను లాగేసుకుంటోంది. ప్రభుత్వ అధినేత సీఎం కేసీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా మారారు. బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.ఐదు కోట్లకు పైగా పలుకుతుంటే..ప్రభుత్వం మాత్రం రైతుల సమ్మతి, సంబంధం లేకుండా రూ.10 లక్షలు చెల్లించి, బలవంతంగా భూములను స్వాధీనం చేసుకుంటోంది. ఆయా భూములను ఐటీ సంస్థలకు, బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టి బ్యాక్‌డోర్‌ నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇలా వచ్చిన డబ్బులనే ఎన్నికల్లో వెదజల్లుతున్నారు’ అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు.

శుక్రవారం మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌లో నిర్వహించిన ‘భారతీయ జనతా యువమోర్చా– రంగారెడ్డి జిల్లా’ శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. కంపెనీలకు, ప్రభుత్వానికి, ఫాంహౌస్‌లకు భూములు ఇచ్చిన రైతులు నేడు అదే కంపెనీలు, ఫౌంహౌస్‌ల్లో వాచ్‌మన్లుగా పని చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ అంశాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుని పని చేయడం ద్వారా ప్రజల మద్దతు పొందొచ్చని సూచించారు. ఇందుకు ప్రతి ఒక్క బీజేవైఎం కార్యకర్త సిద్ధంంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.  ఫార్మాసిటీ పేరుతో అమాయక రైతుల నుంచి 19వేలకుపైగా ఎకరాల భూమి సేకరిస్తోందని, ఈ ఫార్మాకంపెనీల వల్ల ఆయా గ్రామాల రైతులంతా తమ భూమిని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో తీవ్రమైన కాలుష్యం బారి నపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఎవడబ్బ సొమ్మని పంచుతున్నారు?
అభివృద్ధి కార్యక్రమాలకు, పేదల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ డబ్బును వేల కోట్లున్న రియల్టర్లకు, ఫౌంహౌస్‌ యజమానులకు, వ్యవసాయేతర భూములకు రైతుబంధు పేరుతో పంచిపెడుతుండటాన్ని ఎలా సమర్థిస్తామని, నెలకు రూ.1.40 లక్షల జీతం పొందే ఉద్యోగులకు దళిత బంధు పేరుతో కార్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు.
చదవండి: తెలంగాణ ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారు: తరుణ్ చుగ్

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top