రావెల సుశీల్‌కు రెండు రోజుల కస్టడీ | Sushil ravela to custody for two days | Sakshi
Sakshi News home page

రావెల సుశీల్‌కు రెండు రోజుల కస్టడీ

Mar 9 2016 5:14 AM | Updated on Aug 29 2018 7:45 PM

రావెల సుశీల్‌కు రెండు రోజుల కస్టడీ - Sakshi

రావెల సుశీల్‌కు రెండు రోజుల కస్టడీ

మహిళా టీచర్ ఫాతిమా బేగం పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్(24)ను రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

హైదరాబాద్: మహిళా టీచర్ ఫాతిమా బేగం పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు సుశీల్(24)ను రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 6న సుశీల్‌ను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

ఈ కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి అడిగారు. మంగళవారం వాదోపవాదాలు విన్న అనంతరం కోర్టు ఈ నెల 9, 10 తేదీల్లో కస్టడీకి అనుమతించింది. బుధవారం ఉదయం జైలు నుంచి బంజారాహిల్స్ స్టేషన్‌కు సుశీల్‌ను తీసుకురానున్నారు. విచారణ అనంతరం గురువారం సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి జైలులో అప్పగిస్తారు. ఇదిలా ఉండగా సుశీల్ కారు డ్రైవర్ రమేశ్‌ను కూడా రెండు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement