షాపింగ్కు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం.. | Sakshi
Sakshi News home page

షాపింగ్కు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం..

Published Fri, Oct 16 2015 9:28 PM

షాపింగ్కు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం.. - Sakshi

చిక్కడపల్లి(హైదరాబాద్) : షాపింగ్ చేయడానికి వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం పిలిటి గ్రామానికి చెందిన కుప్పిలి దమయంతి(19) గత కొన్ని రోజుల నుంచి దోమలగూడలోని లైఫ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ ఇనిస్టిస్ట్యూట్లో గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటోంది.

ఈ నెల 11వ తేదిన సాయంత్రం 7 గంటలకు హాస్టల్ నుంచి షాపింగ్‌కు అని వెళ్లిన దమయంతి తిరిగి రాలేదు. ఆమె అచూకీ కోసం కుటుంబసభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయేసరికి ఆమె తల్లిదంద్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement