డీసీఎం ఢీకొని విద్యార్థిని మృతి | student mamatha died and one injured in a road accident | Sakshi
Sakshi News home page

డీసీఎం ఢీకొని విద్యార్థిని మృతి

Aug 11 2015 7:43 PM | Updated on Nov 9 2018 4:31 PM

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతిచెందింది.

హైదరాబాద్ సిటీ: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. రోడ్డు దాటుతున్న ఇద్దరు విద్యార్థులను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మమత(16) అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. గాయపడిన విద్యార్థినిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement