విద్యార్థిని బలిగొన్న బైక్ రేసింగ్ | Student killed in Bike racing | Sakshi
Sakshi News home page

విద్యార్థిని బలిగొన్న బైక్ రేసింగ్

Jul 7 2016 1:49 AM | Updated on Sep 4 2017 4:16 AM

విద్యార్థిని బలిగొన్న బైక్ రేసింగ్

విద్యార్థిని బలిగొన్న బైక్ రేసింగ్

బైక్ రేసింగ్ ఓ బీటెక్ విద్యార్థిని బలిగొంది. వేగంగా వెళుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

హైదరాబాద్: బైక్ రేసింగ్ ఓ బీటెక్ విద్యార్థిని బలిగొంది. వేగంగా వెళుతున్న బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. నగరంలో ఈదీబజార్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ పురాఖాన్ (22), మొగల్‌పురాకు చెందిన మహ్మద్ ఇర్షాద్ అహ్మద్ (22) స్నేహితులు. నిజాం ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. బుధవారం తెల్లవారుజామున నమాజ్ అనంతరం ఇర్షాద్ అహ్మద్ స్పోర్ట్స్ బైక్‌పై పురాఖాన్‌తో కలసి ఇంటికి వచ్చాడు.
 
 అనంతరం ఇద్దరూ నల్లగొండ క్రాస్‌రోడ్ ఫ్లై ఓవర్‌పై బైక్ రేసింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీకొట్టారు. తీవ్రగాయాలు కావడంతో బైక్ వెనుక కూర్చున్న పురాఖాన్ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ నడుపుతున్న ఇర్షాద్ అహ్మద్‌కూ తీవ్ర గాయాలయ్యాయి. ఇతడు మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement