స్పైస్‌జెట్ విమానాల రాకపోకలు రద్దు | Spice Jet flight schedules Cancel | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్ విమానాల రాకపోకలు రద్దు

Dec 17 2014 4:54 AM | Updated on Oct 2 2018 7:37 PM

స్పైస్‌జెట్ విమానాల రాకపోకలు రద్దు - Sakshi

స్పైస్‌జెట్ విమానాల రాకపోకలు రద్దు

సంక్షోభంలో కూరుకుపోయిన స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ సంస్థ హైదరాబాద్ నుంచి ..

శంషాబాద్: సంక్షోభంలో కూరుకుపోయిన స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ సంస్థ హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలను సోమవారం అర్ధరాత్రి నుంచి రద్దు చేసింది. ఎస్‌జీ 806,1007,401,108,1074 విమానాలు గోవా, విజయవాడ, ముంబై, కొచ్చిన్, బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సి ఉండగా వాటిని ఆ సంస్థ రద్దు చేసింది.

అలాగే మంగళవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఇక్కడి నుంచి కోయంబత్తూరు, ఇండోర్, తిరుపతి, కొచ్చిన్, మధురై, రాజమండ్రి బయలుదేరాల్సిన ఎస్‌జీ 1045, 1056, 1041, 235, 3313, 1061, 1021 విమానాలను పూర్తిగా రద్దు చేశారు. ఇందులో తిరుపతి వెళ్లాల్సిన రెండు విమానాలు కూడా రద్దయ్యాయి.    దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement