‘మిషన్’ పనులు పూర్తి చేయండి | Speed up Mission Kakatiya works says joshi | Sakshi
Sakshi News home page

‘మిషన్’ పనులు పూర్తి చేయండి

Apr 24 2016 3:44 AM | Updated on Sep 3 2017 10:35 PM

మిషన్ కాకతీయ పనుల్లో బాగా వెనుకబడిన జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు.

అధికారులను ఆదేశించిన నీటిపారుదల ముఖ్యకార్యదర్శి
సాక్షి, హైదరాబాద్:
మిషన్ కాకతీయ పనుల్లో బాగా వెనుకబడిన జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావు తరుఫున జోషి మిషన్ కాకతీయపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మిషన్ కాకతీయ పనులు చాలా వెనుక బడ్డాయన్నారు. సరిగా పనిచేయని ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని, వెంటనే వారికి మెమోలు జారీ చేయాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement