బేకరీలో బెల్ట్ షాపు | SOT police attacks in uppal | Sakshi
Sakshi News home page

బేకరీలో బెల్ట్ షాపు

May 30 2016 5:27 PM | Updated on Sep 4 2017 1:16 AM

పేరుకు బేకరీ..కానీ లోపల జరిగేది మద్యం వ్యాపారం..

బోడుప్పల్: పేరుకు బేకరీ..కానీ లోపల జరిగేది మద్యం వ్యాపారం..నగరంలోని  బోడుప్పల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం బాటిల్స్ పెట్టి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 51 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ నాగయ్య సమాచారం మేరకు... పర్వతాపూర్‌కు చెందిన సుర్వి రవిగౌడ్ స్థానికంగా బేకరీ నిర్వహిస్తున్నాడు. మద్యం దుకాణాలను నుంచి బాటిల్స్ తీసుకొచ్చి బేకరిలో వాటిని విక్రయిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సోమవారం ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దాడిలో 51 మద్యం బాటిల్స్ దొరికాయి. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement