బీజేపీపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ : బీజేపీపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్కు పట్టినగతే బీజేపీకి పడుతుందన్నారు. ఏపీకి బీజేపీ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం రూ. లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి స్పష్టం చేశారు.