సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం | software engineer Missing in hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

May 25 2016 8:59 AM | Updated on Oct 22 2018 7:50 PM

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం - Sakshi

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన స్టాఫ్ట్‌వేర్‌ అదృశ్యమయ్యాడు. గచ్చిబౌలి సీఐ జె.రమేశ్‌ కుమార్‌ కథనం ప్రకారం...

హైదరాబాద్: విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన స్టాఫ్ట్‌వేర్‌ అదృశ్యమయ్యాడు. గచ్చి బౌలి సీఐ జె.రమేశ్‌ కుమార్‌ కథనం ప్రకారం... బల్కంపేట ఎల్లమ్మ గుడి సమీపం లో నివాసం ఉండే  వల్లిపల్లి హష్మి(26) నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని వేవ్‌రాక్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 8.15కి డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు.

మంగళవారం ఉదయానికి కూడా అతను ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు కంపెనీలో ఆరా తీయగా ఇంటికి వెళ్లిపోయాడని చెప్పారు. కాల్‌ చేస్తే సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. హష్మి కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో సోదరుడు ఉమామహేశ్వర్‌రావు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement