సింగరేణి సంస్థ బోర్డు ఆఫ్ డెరైక్టర్ల సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తిపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది.
గోదావరిఖని, న్యూస్‌లైన్: సింగరేణి సంస్థ బోర్డు ఆఫ్ డెరైక్టర్ల సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తిపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది. ఇదే అంశంపై సింగరేణివ్యాప్తంగా ఉన్న ఏరియాల జీఎంలతో డెరైక్టర్లు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు పకడ్బందీ వ్యూహంతో సాగాలని డెరైక్టర్లు జీఎంలకు సూచించే అవకాశముంది.
ఏపీ సర్వీస్‌లోకి సుతీర్థ భట్టాచార్య!
సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య పదవీకాలం ఈనెల 11వ తేదీతో ముగియగా ప్రభుత్వం ఆయనకు పొడిగింపు ఇవ్వలేదు. గతంలో పనిచేసిన చాలామంది సీఎండీలకు పదవీకాలాన్ని పొడిగించగా సుతీర్థ భట్టాచార్య విషయంలో మాత్రం ప్రభుత్వం మిన్నకుండిపోయింది. భట్టాచార్య సైతం తన పదవీకాలం పొడిగింపు కోసం ఉత్సాహం చూపడం లేదని సమాచారం. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ సర్వీస్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణికి కొత్త సీఎండీని నియమించే అవకాశముంది.