కుమారుడిని వెతుక్కుంటూ వచ్చి.. | she find her son in hyderabad | Sakshi
Sakshi News home page

కుమారుడిని వెతుక్కుంటూ వచ్చి..

Aug 1 2015 9:31 PM | Updated on Oct 2 2018 4:31 PM

కొడుకు కోసం నగరానికి వచ్చిన ఓ వృద్ధురాలు అడ్రస్ ఉన్న కాగితాన్ని పోగొట్టుకొని రోడ్డుపాలై రోదిస్తూ తిరుగుతుండగా స్థానికుల సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చేరదీశారు.

బంజారాహిల్స్: కొడుకు కోసం నగరానికి వచ్చిన ఓ వృద్ధురాలు అడ్రస్ ఉన్న కాగితాన్ని పోగొట్టుకొని రోడ్డుపాలై రోదిస్తూ తిరుగుతుండగా స్థానికుల సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చేరదీశారు. తన పేరు లక్ష్మమ్మ అని వరంగల్ జిల్లా అంటూ మాత్రమే చెబుతున్న ఈ వృద్ధురాలు బోరబండ ప్రాంతంలో రోదిస్తూ తిరుగుతుండగా స్థానికులు గమనించారు.

సమాచారం అందించటంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె కుమారుడిని వాకబు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకు సంబంధించిన వివరాల కోసం 9490616585 సెల్ నంబర్ లో సంప్రదించవచ్చని ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement