ముస్లిం రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ మూడోసారి మోసం చేశారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు.
హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ మూడోసారి మోసం చేశారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి.. చేతులు దులుపుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ అబద్దాలు చెప్తుంటే ఓవైసీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సుధీర్ కమిటీతో రిజర్వేషన్లు సాధ్యమో కాదో ఓవైసీ చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.