కరువు కనిపించదా?: బీజేపీ | Severity of drought : BJP | Sakshi
Sakshi News home page

కరువు కనిపించదా?: బీజేపీ

Aug 27 2016 1:22 AM | Updated on Mar 29 2019 9:31 PM

కరువు కనిపించదా?: బీజేపీ - Sakshi

కరువు కనిపించదా?: బీజేపీ

రాష్ట్రంలో కరువు తీవ్రత ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ప్రశ్నించారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు తీవ్రత ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ప్రశ్నించారు. రైతులను పట్టించుకోకుండా ప్రభుత్వంలో ఉన్నవారు విలాసాల్లో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలోనే నంబర్‌వన్ సీఎం అని చెప్పుకుం టున్న వారు ఎందులో నంబర్‌వన్నో చెప్పాలని సవాల్ చేశారు. హామీలు అమలు చేయకపోవడం, యూటర్న్ తీసుకోవడం, కరువును పట్టించుకోకుండా మొద్దునిద్రపోవడంలో నెంబర్‌వన్నా అని ప్రశ్నించారు. పంట రుణాలను మాఫీ చేయాలని.. కరువు ఉపశమన, నివారణ చర్యలపై అఖిలపక్షం నిర్వహించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement