ఇంగ్లిష్‌పై సాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ | sakshi edge for english training | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌పై సాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ

Apr 13 2017 4:07 AM | Updated on Aug 20 2018 8:20 PM

ఇంగ్లిష్‌పై సాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ - Sakshi

ఇంగ్లిష్‌పై సాక్షి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ

ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి.

సాక్షి, హైదరాబాద్‌: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ప్రపంచ భాష ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదిం చేందుకు ‘సాక్షి ఎడ్జ్‌’ ఒక వేదికగా నిలుస్తుంది. మీ కృషి, పట్టుదలకు మా సహకారం తోడవుతుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనుకునే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్‌’ వినూత్నమైన శిక్షణను అందజేస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి విజేతలుగా నిలబెడుతుంది.

ఈ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులో భాషా పరిచయంతోపాటు ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్‌ను అధిగ మించడం, గ్రామర్‌ వంటి ముఖ్య అంశాల్లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయ వంతంగా పూర్తి చేసినవారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. కోర్సు కాలపరి మితి ఏప్రిల్‌ 15 నుంచి మే 17 వరకు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు తరగతులుంటాయి. రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాల యంలో జరుగుతాయి. క్లాసులు హైదరాబాద్‌లోని సాక్షి జర్నలిజం స్కూల్‌లో జరుగుతాయి. కోర్సు ఫీజు రూ.4,600. మరిన్ని వివరాల కోసం 9603533300 నంబర్‌ లేదా  sakshiedge@gmail.com మెయిల్‌ను సంప్రదించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement