ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం | rtc driver suicide in hyderabad bus depot | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Dec 23 2015 3:43 PM | Updated on Nov 6 2018 7:56 PM

అన్యాయంగా తనను సస్పెండ్ చేశారనే మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన దిల్సుఖ్నగర్ బస్ డిపోలో జరిగింది.

దిల్సుఖ్నగర్: అన్యాయంగా తనను సస్పెండ్ చేశారనే మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన దిల్సుఖ్నగర్ బస్ డిపోలో జరిగింది. దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న సైదులును ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన సైదులు బుధవారం డిపో ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై తోటి ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement