నేటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు | RSS meetings from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు

Oct 23 2016 3:02 AM | Updated on Sep 4 2017 6:00 PM

ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్నాయి

హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 23 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యావిహార్‌లో జరుగుతాయని సంఘ్ అఖిలభారత ప్రచారక్‌ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు. అన్నోజిగూడలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ సర్‌సంఘ్ చాలక్ మోహన్‌జీ భగవత్, భయ్యాజీ వంటి ప్రముఖులు పాల్గొంటారని వివరించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన 42 రాష్ట్రాల(ప్రాంతాలు)కు చెందిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహకులు, అఖిల భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొంటారని వివరించారు. మౌలిక విషయాలు, జాతీయ అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. సమావేశాల్లో ఏదైనా ఒక రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రచారక్ ప్రముఖ్ ఆయుష్ తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement