breaking news
Manmohan medical
-
ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ సమావేశాలు
హైదరాబాద్: నగరంలోని అన్నోజీగూడలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను మోహన్ భగవత్, భయ్యాజీ జోషి ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు 400 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. అన్నోజీగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. రేపు, ఎల్లుండి సమావేశాల్లో అమిత్ షా పాల్గొననున్నట్టు సమాచారం. -
నేటి నుంచి ఆర్ఎస్ఎస్ సమావేశాలు
హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 23 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యావిహార్లో జరుగుతాయని సంఘ్ అఖిలభారత ప్రచారక్ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు. అన్నోజిగూడలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ జాతీయ సర్సంఘ్ చాలక్ మోహన్జీ భగవత్, భయ్యాజీ వంటి ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. ఆర్ఎస్ఎస్కి చెందిన 42 రాష్ట్రాల(ప్రాంతాలు)కు చెందిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహకులు, అఖిల భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొంటారని వివరించారు. మౌలిక విషయాలు, జాతీయ అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. సమావేశాల్లో ఏదైనా ఒక రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రానున్నారని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రచారక్ ప్రముఖ్ ఆయుష్ తెలిపారు.