'గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో రూ.2.58 కోట్లు స్వాధీనం' | Rs 2.58 crore seized during Greater elections, says election commissioner Janardhan reddy | Sakshi
Sakshi News home page

'గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో రూ.2.58 కోట్లు స్వాధీనం'

Feb 1 2016 7:37 PM | Updated on Sep 3 2017 4:46 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఎన్నికల అధికారి జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌: నగరంలో రేపు(మంగళవారం) జీహెచ్‌ఎంసీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఎన్నికల అధికారి జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. అంధులు ఓటు వేసేందుకు వీలుగా బ్రెయిలి లిపి బ్యాలెట్‌ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పోలింగ్‌ స్టేషన్లలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 2.58 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.1.5 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారి జనార్ధన్‌ రెడ్డి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement